టీటీఈ దాదా..!

క్రైం జాతీయం తెలంగాణ హైదరాబాద్

టీటీఈ దాదా..!
– రైల్వే ప్రయాణికుడిపై దాడి
– సోషల్ మీడియాలో వీడియో వైరల్‌
దర్శిని డెస్క్ : అధికారులు ఎవ్వరైనా ప్రజలకు జవాబుదారితనంగా నడుచుకోంటే వారిపై ఎనలేని గౌరవం పెరుగుతోంది. అదే అధికారి అహంకారాన్ని ప్రదర్శిస్తే హీనుడుగా కీర్తించబడతాడు. కేంద్ర ప్రభుత్వంలోని రైల్వే శాఖలో టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌)గా పనిచేస్తున్న ఓ ఉద్యోది రైల్వే ప్రయాణికుడిపై అమానుషంగా ప్రవర్తించారు. తోటి ప్రయాణికుడు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే… బరౌనీ- లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. ఓ 25 ఏళ్ల యువకుడు టికెట్‌తో రైలు నంబరు.15203లో ముజఫర్‌పూర్‌ నుంచి లఖ్‌నవూకు ప్రయాణిస్తుండగా టీటీఈ దాడికి దిగాడు.

ప్రయాణికుడి చెంపపై పలుమార్లు కొట్టాడు. అతని ముఖానికి, మెడలో ఉన్న తువాలును లాగి మరీ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. టీటీఈ చర్యపై నెటిజన్లతో సహా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో లఖ్‌నవూ డివిజన్‌ DRM టీటీఈని సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రయాణికుడిపై టీటీఈ అసలు ఎందుకు దాడి చేశాడో తెలియరాలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటనపై పలువురు నెటిజన్లు టీటీఈని దాదాగా, గుండాగా అభివర్ణిస్తూ విమర్శిస్తున్నారు. (ఈ కింది లింకులో వీడియో చూడవచ్చు…)

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!