రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు

తాండూరు రాజకీయం వికారాబాద్

రిజర్వేషన్లు తేల్చాకే ఎన్నికలు
– సర్కారుకు బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం
– ఒత్తిడి పెంచడంలో బీజేపీ, బీఆర్ఎస్ ఫెయిల్
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టబద్దమైన జీవోలు కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను అమలు చేస్తామని అసెంబ్లీలో ఆమోదించడం హర్షణీయమం, కాని కేంద్ర ప్రభుత్వంతో ఆమోదించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. ఓ వైపు సెప్టెంబర్ 30లోగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం అడ్డంకి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత రాజ్యాంగంలో 73-74వ సవరణ చేసిన సమయంలో 243డీ6 ప్రకారం |బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసీల రిజర్వేషన్లను 42శాతంకు పెంచాలన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఎట్టి పరిస్థితుల్లో సహించలేమని అన్నారు. మరోవైపు రిజర్వేషన్లు పెంపు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావడంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని వి మర్శించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు బీసీల రిజర్వేషన్లను 42శాతంకు పెంచే విధంగా ఒత్తిడి తీసుకరావాలని అన్నారు. రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి…

భాను పవార్ కుటుంబానికి అండగా ఉంటాం