ప్రజలకు మెరుగైన వైద్యం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రజలకు మెరుగైన వైద్యం
– ఎంసీహెచ్ ప్రసవ సేవలు భేష్
– డీఎంహెచ్ డాకర్టర్ లలితా దేవి
– జిల్లా ఆసుపత్రి, అర్బన్ ఆరోగ్య కేంద్రాల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించేలా దృష్టిసారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లలితా దేవి అన్నారు. గురువారం తాండూరు లోని మాతా శిశు ఆసుపత్రి, ఇందిరానగర్ లోని అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించి తనిఖీలు చేశారు.

మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాలు గురించి అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలతో మాట్లాడారు. చిన్నారులకు, ప్రత్యేక అవసరాల పిల్లలకు అందించే వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు, సీజరియన్ ఆపరేషన్ ప్రసవాల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణీలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించారు. లాబ్ ద్వారా ఆరోగ్య పరిక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందుబాటులో ఉంచిన మందులు, సదుపాయాలు పరిశీలించారు. అనంతరం తాండూరు పట్టణం పాత తాండూరులోని బస్తీ దవఖానాను సందర్శించారు.

అక్కడి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్కడ వైద్యులతో కలిసి ఆసుపత్రిలో పర్యటించారు. పలు వార్డుల్లో రోగులకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. డయాలిస్ కేంద్రంలో ఎంతమందికి రక్తశుద్ది చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇతర విభాగాల్లో లోటుపాట్లను ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎం హెచ్ఓ డాక్టర్ లలితా దేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం వైద్యులు సక్రమంగా పనిచేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. మాతా శిశు ఆసుపత్రిలో ప్రసూతి వైద్య సేవలు, చిన్నారులకు వైద్య సేవలు బాగున్నాయని తెలిపారు. పట్టణంలోని అర్బన్ ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించడంతో పాటు ఉత్తమ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఎంహెచ్ డాక్టర్ రవీంద్రయాదవ్, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓ డా.ఆనంద్ గోపాల్ రెడ్డి, వైద్యులు, ప్రోగ్రామ్ ఆఫీసర్, సిబ్బంది తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

ఇక మహిళల జీవితాలు మారోచ్చు..!