పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
– తాండూరు ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్
– తడిచెత్త, పొడిచెత్తపై అవగాహన
తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్ అన్నారు.

సోమవారం తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు.

ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. ఇండ్లలో తోట్లు, నిరుపయోగంగా ఉండే వస్తువుల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. చెత్త, చెదారం పెరగకుండా చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకుండా తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరి ఇను స్పెక్టర్ వెంకటయ్య, ఎన్వీరాల్ మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రతిభ భారతి, వార్డు ఆఫీసర్లు కార్తిక్, యాదగిరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

