యాసంగి వరికి భరోసా ఇవ్వాలి
– టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు
– మహాదర్నాలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన
తాండూరు , దర్శిని ప్రతినిధి: యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, యాలాల మాజీ ఎంపీపీ కరణం పురుషోత్తంరావు డిమాండ్ చేశారు. గురువారం టీఆర్ఎస్ ప్రభుత్వం పిలుపు మేరకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్కులో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వమించిన రైతు మహాదర్నాలో కరణం పురుషోత్తంరావు పాల్పంచుకున్నారు. నాగలి నా నాగరికత, రైతే మా మతం అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మన ముఖ్యమంత్రి రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులను ఇబ్బందులకు గురిచేసేలా ప్రవర్తిస్తోందన్నారు. ఇది ఏమాత్రం సరికాదని, తెలంగాణలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కొనేదాకా ఆందోళలు చేపడుతాం. యావత్తు తెలంగాణ ప్రజలు, రైతులు ముఖ్యమంత్రి వెన్నంటి ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట యాలాల టీఆర్ఎస్ యువనాయకులు కృష్ణకుమార్, నాయకులు, రైతులు ఉన్నారు.
