ఒగ్గు క‌ళాకారుల అభివృద్ధికి కృషి

తాండూరు వికారాబాద్

ఒగ్గు క‌ళాకారుల అభివృద్ధికి కృషి
-కురుమ సంఘం జిల్లా అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్
పెద్దేముల్, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఒగ్గు క‌ళాకారుల అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం వికారాబాద్ జిల్లా అధ్య‌క్షులు, టీఆర్ఎస్ మండ‌ల పార్టీ అధ్య‌క్షులు కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. వికారాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులుగా కోహిర్ శ్రీనివాస్ యాద‌వ్ ఎన్నికైన సంద‌ర్భంగా గురువారం జిల్లా ఒగ్గు కళాకారుల బృందం ఆయ‌ను ఘ‌నంగా స‌న్మానించింది. ఈ సంద‌ర్భంగా కోహీర్ శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ ఒగ్గు క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక గుర్తింపుతో పాటు వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ముందుంటాన‌ని అన్నారు. వారి డిమాండ్ల‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స‌హాకారంతో ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృధ్ధి చెందేలా కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఒగ్గు కళాకారులు పూజారి మల్లేశం, పూజారి మల్లప్ప, ఎల్ఐసి మల్లేశం, ధనరాజ్, మహేష్, శ్రీనివాస్, బీరు తదితరులు పాల్గొన్నారు.