బాతు ఖానా..!
– చేపలకు ఆహారం అందించిన వైనం
– ఆకట్టుకున్న విడియో
దర్శిని బ్యూరో: సృష్టిలో మనషులు తోటి మనషులకు సాయం అందించి మానవత్వాన్నిచాటుకుంటుంటారు. ఇదే మానవత్వం పక్షులు, జంతువులలో కనిపిస్తోంటో్ంది. కొన్ని సందర్భాలలో తోటి జంతువులకు సాయం చేసే దృశ్యాలు ముచ్చటేస్తుంటాయి. ఇందుకు మనసున్న ప్రతి ఒక్కరు మంత్రముగ్దులవుతారు. సరిగ్గా అలాంటి సంఘటనే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సదరు వీడియోలో బాతు చేపలకు ఆహారం అందిస్తోంది. నోటి ద్వారా వాటికి ఆహారం చేరవేస్తోంది. బాతు అందిస్తోన్న ఆహారం అందుకునేందుకు చేపలు ఒకదాని వెంట ఒకటి అక్కడికి చేరకుంటున్నాయి. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. విడియోను చూసిన పలువురు మెచ్చుకుంటున్నారు. వావ్.. బాతు ఖానా సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఈ వీడియోను animals_geolife అనే ఇన్ స్టా ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటికే 85 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. మీరు కూడ వీడియో వీక్షించండి.

