నిమజ్జనాకి పక్కా ఏర్పాట్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

నిమజ్జనాకి పక్కా ఏర్పాట్లు..!
– 300ల మంది పోలీసులతో బందోబస్తు
– వికారాబాద్ జిల్లా ఎస్పీనారాయణ రెడ్డి
– తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్
– కోకట్ వాగు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జనానికి పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ లు సూచించారు.
kvcs
శుక్రవారం యాలాల మండలం కోకట్ కాగ్నా వాగును సందర్శించారు. ఆదివారం జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. తాండూరు డీఎస్సీ బాలకృష్ణారెడ్డితో పాటు మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో పాటు హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి నిమజ్జన ఏర్పాట్లను ఆరా తీశారు. వినాయకులు తరలించే రూట్, నిమజ్జనం చేసే ప్రదేశంను చూశారు. నిమజ్జన స్థలం వద్ద బారికేట్లు, విద్యుత్ సదుపాయాలు, సిబ్బంది వివరాల గురించి అడిగితెలుసుకున్నారు.

ఆయా శాఖల నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, నిమజ్జనోత్సవంలో ఎలాంటి అసౌకర్యాలు, ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. తాండూరు నుంచి వచ్చే వినాయకుల నిమజ్జనం గురించి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్ లకు వివరించారు. అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరులో వినాయక నిమజ్జనం ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా దృష్టిసారిస్తున్నామన్నారు.

నిమజ్జనంను దృష్టిలో ఉంచుకుని 300 పోలీసు సిబ్బందితో బందోబస్తు ఉంటుందని, 4గురు డీఎస్పీ, 10 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు, ప్రత్యేక బృందాలు, పోలీసు సిబ్బంది నిమజ్జనం బందోబస్తులో పాల్గొంటారని వెల్లడించారు. వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ యాదగిరి, విద్యుత్ డీఈ భానుప్రసాద్, తాండూరు రూరల్ సీఐ నగేష్, ఎస్ఐఐలు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఇదికూడా చదవండి…

శంకరన్న జన్మదినం.. సేవా సంబరం..!