నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తోడ్పాటు
– తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
– మర్యాదపూర్వకంగా కలిసిన స్టోన్, క్వారీ అసోసియేషన్ సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు స్టోన్ మర్చంట్స్, క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ నూతన కార్యవర్గ సభ్యులు, వ్యాపారులు హైదరాబాద్ లో చీఫ్ విప్ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మహేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా నాపరాతి వ్యాపారుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. కొత్త కార్యవర్గంకు అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా వ్యాపారుల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ది స్టోన్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అఫ్పూ(నయూం), ది తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోయేషన్ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు ఎంఏ సత్తార్, విజయ్ రమణ రావు, ప్రధాన కార్యదర్శి కుంచెం మురళిధర్, సంయుక్త కార్యదర్శులు సయ్యద్ హబీబ్, బ్రిజ్ మోహన్ బూబ్, కోశాధికారి సంజీవ్ కుమార్, ది తాండూరు మండల క్వారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోయేషన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ అన్వర్ అహమ్మద్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జుబేర్ లాల, మహమ్మద్ జైనూద్దీన్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

