తండ్రికి టాటా.. చెప్పి..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

తండ్రికి టాటా.. చెప్పి..!
– బస్సు ప్రమాదంలో విద్యార్థిని మృతి
– కరణ్ కోట్ కు చెందిన ముస్కాన్ గా గుర్తింపు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బస్సు ఎక్కించేందుకు వచ్చిన తండ్రికి టాటా చెప్పిన కొన్ని గంటల్లోనే కాలేజీ కన్నుమూసింది. చేవేళ్ల మండలంలో జరిగిన టిప్పర్ లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాండూరు మండలానికి చెందిన కాలేజీ విద్యార్థిని మృతి చెందింది.

మండలంలోని కరణ్ కోట్ గ్రామానికి చెందిన చాంద్ పాష స్టోన్ వ్యాపారిగా ఉన్నారు. మండలంలోని గౌతాపూర్ గ్రామంలో ఇళ్లు నిర్మించుకుని అక్కడే ఉంటున్నారు. వారి కూతురు ముస్కాన్(21) హైదరాబాద్ లోని కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. సెలవులు ఎప్పుడు వచ్చినా సరే, ఆదివారం రోజు కూడా గ్రామానికి వస్తుంది.
kvcs
అలా సెలవులో వచ్చిన ముస్కాన్ సోమవారం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ కు బయల్దేరింది. అంతకుముందే చాంద్ పాష తన కూతురు ముస్కాన్ ను బస్సులో ఎక్కించారు. తన కోసం వచ్చిన తండ్రికి బస్సులో నుంచి టాటా చెప్పి ముస్కాన్ బయల్దేరింది. కాని చేవేళ్ల మండలంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముస్కాన్ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

ఇదికూడా చదవండి…

తీర్చలేని విషాదం..!