తాండూరుకు గంజాయి రవాణా
– పక్కా స్కెచ్‌తో పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు
– ప్యాకెట్లు, చాక్లెట్లు స్వాదీనం
– అదుపులోకి ముగ్గురు నిందితులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మీదుగా వెళ్లే కోణార్క్ ట్రైన్ లో ఎక్సైజ్ పోలీసులు గంజాయితో పాటు గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు.

ఈ సంఘటన ఆదివారం తాండూరు రైల్వే స్టేషన్ లో జరిగింది. గత కొన్నేళ్లుగా తాండూరు మీదుగా గంజాయి రవాణా యధేచ్ఛగా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి. తాజాగా తాండూరుకు గంజాయిని తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందడంతో డీటీఎఫ్ బృందం తాండూరు, పరిగి ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

తాండూరులో ఆగిన కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు. ఈక్రమంలో వారి వద్ద నుంచి సుమారు 6 కిలోల ప్యాకెట్లు, గంజాయి చాక్లెట్లను గుర్తించారు. ఈ మేరకు గంజాయి, చాక్లెట్లతో పాటు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి…

