కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త సర్పంచుల కీలక నిర్ణయం..!
– వారి పదవులకు రాజీనామాలు
– బషీరాబాద్ మండలంలో పరిణామాలు
బషీరాబాద్, దర్శినిప్రతినిధి : పంచాయతీ ఎన్నికల్లో కొత్త సర్పంచులుగా ఎన్నికైన అభ్యర్థులు కీలక నీర్ణయం తీసుకున్నారు. వారికి ఉన్న పాత పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఈ పరిణామాలు బషీరాబాద్ మండలం నావంద్గి పీఏసీఎస్ కార్యాలయంలో చోటు చేసుకున్నాయి.

వికారాబాద్‌ జిల్లాలో తొలి విడతలో భాగంగా బషీరాబాద్‌ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మండలంలోని కోర్విచేడ్ గ్రామ సర్పంచుగా గ్రామానికి చెందిన నవీన్ రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా మంతన్ గౌడ్ తాండా గ్రామ పంచాయతీకి చెందిన అనూష బాయ్ కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

ఈ ఇద్దరు సర్పంచులు బషీరాబాద్ మండలం నవాంద్గి పీఏసీఎస్ కార్యాలయంలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలవడం పట్ల వారు తమ పదవులకు రాజీమానా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ వెంకటరామిరెడ్డి, సిఈఓ వెంకటయ్య కలిసి వారి రాజీనామా పత్రాలను అందజేశారు. దీంతో సోసైటిలో రెండు డైరెక్టర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. మరోవైపు కొత్త సర్పంచులు త్వరలోనే పంచాయతీలో ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు చేపట్టబోతున్నారు.

ఇదికూడా చదవండి…

అంతారంలో ‘పంచాయతీ వివాదం’..!