సైలెన్సర్ల సౌండ్‌పై కొరడా..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

సైలెన్సర్ల సౌండ్‌పై కొరడా..!
– మోతాదు మోత దాటితే వేటు తప్పదు
– రూల్స్ మీరే మెకానిక్లపై కూడా చర్యలు
– తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య
– బుల్లెట్ వాహనాల సైలెన్సర్ల తుక్కు తుక్కు
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారీ శబ్దకాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాల సైలెన్సర్లపై తాండూరు పోలీసులు కొరడా జులిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న బులెట్ వాహనాలను అదుపులోకి సైలెన్సర్లను జేసీబీ యంత్రంతో తుక్కుతుక్కు చేశారు.

మోతాదుకు మించి మోత మోగిస్తే వేటు తప్పదని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య హెచ్చరించారు. సోమవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్ లో వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా శబ్ద కాలుష్యం చేస్తున్న బుల్లెట్ వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎక్కువ శబ్దాలు చేసే వాహనాలు నడిపించడం నిబందనలకు విరుద్దమని అన్నారు.

వాహనదారులు ప్రత్యేక సైలెన్సర్లను అమర్చుకుని భారీ శబ్దాలు చేస్తూ కాలుష్యాన్ని పెంచుతున్నారని అన్నారు. ఈ తరహా చర్యలకు పాల్పడితే వేటు తప్పదని హెచ్చరించారు. వాహనాలకు సౌండ్ సైలెన్సర్లను అమర్చే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మెకానిక్ షాపుల నుంచి, వాహనదారుల నుంచి స్వాదీనం చేసుకున్న సైలెన్సర్లను జేసీబీ యంత్రంతో తుక్కు తుక్కు చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్ కుమార్, ఎస్ఐఐ అంబార్య. ఏఎస్ఐలు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

ఉత్సహాంగా సంక్రాంతి సంబరాలు