కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం..!
– ఎమ్మెల్యే సహాకారంతో 35వ వార్డుకు మహర్దశ
– ఇంటింటి ప్రచారంలో రొంపల్లి సంతోష్ కుమార్
– వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అప్షామైనాను గెలిపించాలి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 35వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎండి అఫ్షామైనా గెలుపుకోసం రొంపల్లి సంతోష్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఓటర్లను కలుస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులోని పుటాన్ గల్లీ, ధన్‌గర్‌గల్లికి మహర్ధశ రావడం ఖాయమని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు వార్డులో రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హామి ఇస్తే నెరవేర్చి తీరుతుందని అన్నారు.

అదేవిధంగా వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్షామైనాకు మంచి ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఖచ్చితంగా వార్డు నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని అన్నారు. వార్డు అభివృద్ధి కోసం ప్రజలు పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనుచరులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

