సాయిమేధాలో ఆవిర్భావ సందడి..!

తాండూరు రాజకీయం వికారాబాద్

chai jrసాయిమేధాలో ఆవిర్భావ సందడి..!
– ఘనంగా దశాబ్ది ఉత్సవ వేడుకలు
– జాతీయ జెండా ఆవిష్కరించి అమరులకు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందడి ఏర్పపడింది. ఆదివారం పాఠశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వీరులకు నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా, అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయని… అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కోరారు. విద్యా, వైద్యంపై మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు చక్కగా విద్యాబోధన చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలకు సంపదైన విద్యార్థులు చక్కటి క్రమశిక్షణతో ఉంటూ మంచిగా చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సజిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సంబరంగా దశాబ్ది పండగ..!