పేద కుటుంబాల‌కు స‌ర్కారు అండ

తాండూరు రాజకీయం వికారాబాద్

పేద కుటుంబాల‌కు స‌ర్కారు అండ
– నాగ‌ప్ప కుటుంబానికి రూ. 5ల‌క్ష‌ల ప‌రిహారం
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తెలంగాణ స‌ర్కారు పేద కుటుంబాల‌కు అండ‌గా నిలుస్తోంద‌ని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. తాండూరు నియోజ‌క‌వర్గం బ‌షీరాబాద్ మండ‌లంలోని జీవ‌న్గీ గ్రామానికి చెందిన పోతురాజు నాగప్ప, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు శివ కుమార్ గత ఏడాది డిసెంబర్ లో ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కు గురై మృతి చెందాడు. అప్ప‌ట్లో కుటుంబాన్ని ఆదుకోవాల‌ని బాధితుల‌తో పాటు గ్రామ‌స్తులు తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని కోరారు. దీంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత‌నందించేందుకు కృషి చేశారు. మృతుడు శివకుమార్ కుటుంబానికి పరిహారం అందెందుకు ప్రత్యేక చొరవ చూప‌డంతో ప్ర‌భుత్వం రూ. 5ల‌క్ష‌ల ప‌రిహారాన్ని మంజూరు చేసింది. దీంతో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి బాధిత కుటుంబానికి గ్రామ‌స్తుల స‌హాకారంతో రూ. 5ల‌క్ష‌ల ప‌రిహార చెక్కును అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం నిరుపేద‌ల కుటుంబాల‌ను ఆదుకుంటూ వారికి అండ‌గా నిలుస్తోంద‌ని పేర్కొన్నారు. మ‌రోవైపు ప‌రిహారం అందుకున్న బాధిత కుటుంబ స‌భ్యులు బ‌రువైన‌ క‌న్నీటితో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునిందర్ రెడ్డి, వీరా రెడ్డి, రాములు, దస్తయ్య గౌడ్ తదతరులు ఉన్నారు.