సామాజిక సేవ మార్వాడి యువమంచ్ ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

సామాజిక సేవ మార్వాడి యువమంచ్ ధ్యేయం
– తాండూరులో రెండు ఫిల్టర్‌ వాటర్ చలివేంద్రాలు
– ప్రారంభించిన సమాజం పెద్దలు, మంచ్ అధ్యక్షులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవ చేయడమే మార్వాడి యువమంచ్ ధ్యేయమని తాండూరు శాఖ ప్రతినిధులు అన్నారు.

ప్రతి యేడాది మాదిరిగానే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఉగాది పర్వదినం సందర్భంగా తాండూరు పట్టణంలో ఫిల్టర్ వాటర్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని పోలీస్టేసన్ సమీపంలో, తాండూరు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాలను సమాజం అధ్యక్షులు మురళీధర్ గగ్రాణి, మార్వాడి యువమంచ్ నూతన అధ్యక్షులు కిషన్‌ రాఠిలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంకు చెందిన దాతలు మహేష్ సార్డా, సంజయ్ సోనీ, కైలాష్ సార్డా, మధు సోనీ, శ్రీ స్టోన్ సప్లయర్, ఆశారాం లక్ష్మి నివాస్ సార్డా చారిటబుల్ ట్రస్టుల సహకారంతో చలివేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. సామాజిక సేవే మార్వాడి యువమంచ్ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచ్ సభ్యులు, సమాజ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మార్వాడి యువమంచ్ నూతన కార్యవర్గం ఎన్నిక