తాండూరు రోడ్ల కోసం దండెత్తిన సంఘాలు
– కాలుష్యాన్ని నియంత్రించాలని డిమాండ్
– మెడికల్ కాలేజీని తాండూరుకు తేవాలి
– తాండూరు బంద్‌ను అడ్డుకున్న పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఆద్వాన్నంగా తయారైన రోడ్లను బాగుచేయాలని, కాలుష్యాన్ని నియంత్రించాలని తాండూరు స్వచ్ఛంద సంఘాలు దండెత్తారు. శనివారం తాండూరు డెవలప్ మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తాండూరు బంద్‌కు పిలుపునిచ్చి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రీలే దీక్షకు బైటాయించారు.
ఇందుకు అనుమతి లేదంటూ తాండూరు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతారవణం నెలకొంది. పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి పోలీసు సిబ్బందితో కలిసి ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్నారు. ఆగ్రహించిన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై నినాదాలు చేసుకుంటూ ఇందిరా చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. అంతకుముందు పలువురు మాట్లాడుతూ తాండూరులో రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు. దుమ్ము, దూళీ లేకుండా కాలుష్యాన్ని నియంత్రించాలని ద్వజమెత్తారు. మెడికల్ కాలేజీని తాండూరులో ఏర్పాటు చేయాలన్నారు. కుక్కలబెడద లేకుండా చూడాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హామితో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
