తాండూరులో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి
– అతిసార రోగులపట్ల నిర్లక్ష్యం వహించొద్దు
– బీసీ సంఘం కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి అతిసార రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని బీసీ సంఘం. తాండూరు నియోజకవర్గ కన్వినర్ రాజ్ కుమార్ కందుకూరి డిమాండ్ చేశారు. శనివారం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పాత తాండూరుకు చెందిన అతిసారతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ కు తరలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ అతిసార బాధితుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. అతిసార కేసులను దృష్టిలో ఉంచుకుని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధికారులు అతిసార అవగాహన కల్పించి ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదని లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం. వెంకటేష్, యువజన సంఘం అధ్యక్షులు బోయ నరహరి, ఉపాధ్యక్షులు బోయ రాధకృష్ణ, నాయకులు సంజీవరావు, మతీన్, అశోక్, రాము ముదిరాజ్, రమేష్ టైలర్, గిరిజాపురం రమేష్, టైలర్ నర్సింలు నాయి, అనిల్ నాయి, బస్సు తదితరులు ఉన్నారు.

