మార్వాడి యువమంచ్ హుమానిటీ..!
– రక్త నిల్వల కొరతపై స్పందించిన సభ్యులు
– బ్లడ్ బ్యాంకులో 22 మంది సభ్యుల రక్తదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ సభ్యులు హుమానిటీ(మానవత్వం)ని చాటుకున్నారు. తాండూరు పట్టణం జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో రక్తనిల్వల కొరత ఏర్పడడం పట్ల స్పందించారు.

సోమవారం సాయంత్రం తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో రక్తదానానికి ముందుకు వచ్చారు. మంచ్ కు చెందిన 22 మంది సభ్యులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మంచ్ అద్యక్షులు కిషన్ రాఠీ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వల కొరత ఏర్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

దీంతో వెంటనే సభ్యుల సహాకారంతో రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. సభ్యులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ అభిషేక్ అగర్వాల్, రమాకాంత్ పండిట్, మంచ్ కార్యదర్శి కరణ్ జైన్, మాజీ అధ్యక్షుడు అనిల్ సార్డా, దినేశ్ పర్తాని, జాతీయ కార్యదర్శి రోహిత్ అగర్వాల్, కోశాధికారి భరత్ దేవ్డా, మధు సోనీ, నితిన్ సార్డా, తదితరులు పాల్గొన్నారు.


