ఆ ఇండ్లను వెనక్కి తీసుకోవాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆ ఇండ్లను వెనక్కి తీసుకోవాలి
– పేదలకు అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టండి
– వికారాబాద్ జిల్లా కలెక్టర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఓ ప్రైవేటు ట్రస్టుకు కేటాయిస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇళ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

మంగళవారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాండూరులో వివాదాస్పందంగా మారిన ఎస్‌జీఎఎంకే ట్రస్టుకు డబుల్ బెడ్‌ రూం ఇళ్లను కేటాయింపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను జీఎంకే ట్రస్టు ద్వారా ఒక మైనార్టీ వర్గానికి ఇవ్వడం చట్ట రిత్యా నేరం అప్రజాస్వామికని తెలిపినట్లు చెప్పుకొచ్చారు. తాండూరు పట్టణ ప్రజలందరూ అయోమయానికి గురవుతున్నాయని, కావున ట్రస్టుకు కేటాయిస్తున్న ఇండ్లను వెంటనే వెనక్కి తీసుకునేలా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు.

అదేవిధంగా ట్రస్టుపై వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాహూ శ్రీలత, జిల్లా దిశా మెంబర్ అంతారం లలిత, తాండూరు పట్టణ అధ్యక్షులు, ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం, జిల్లా కార్యదర్శి బండారం భద్రేశ్వర్, కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు దోమ కృష్ణ తదితరులు ఉన్నారు.

మార్వాడి యువమంచ్ హుమానిటీ..!