నాయి బ్రాహ్మణులకు అండగా.!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

నాయి బ్రాహ్మణులకు అండగా.!
– కుల వృత్తుల సంక్షేమానికి సర్కారు భరోసా
– వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్
– రాజుగౌడ్ ను కలిసి నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సర్కారు.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులకు అండగా నిలుస్తోందని వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్ అన్నారు. మంగళవారం తాండూరు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సదర్భంగా రాజుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. నాయి బ్రాహ్మణుల కుల వృత్తికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారని అన్నారు. వారి అభివృద్ధికి రుణాలను కూడ అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం కుల వృత్తిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులకు భరోసా అందిస్తుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో త్వరలోనే కమ్యూనిటీ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కట్టుబడి పనిచేస్తున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి తమవంతు తోడ్పాటు అందిస్తామని.. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.