రేణుకా ఎల్లమ్మ వైభోగం
– ఆలయంలో ఆఖరి శుక్రవార పూజలు
– భజనలు, భక్తులకు అన్నదానాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం నెహ్రు గంజ్‌లో వెలసిన శ్రీ రేణుకా నాగ ఎల్లమ్మ దేవాలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి వైభవంగా పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఆలయంలో గంజ్ భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలాపించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అంమ్రేష్ పంతులు మాట్లాడుతూ శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేకం, అలంకరణలు చేసినట్లు తెలిపారు. సాయంత్రం వేళ మహిళ భక్తులతో లలిత పారాయణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి శనివారం తెల్లవారు జాము వరకు భజన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మరోవైపు శ్రావణమాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు తాండూరు పట్టణ ప్రముఖులు, గంజ్ హామాలి, చాట, దడువై కార్మికులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
