కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్త జీవోలతో చెలగాటం ఆడోద్దు..!
– పాత విధానంలోనే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి
– పెండింగ్‌ బకాయిలు వెంటనే చెల్లించాలి
– జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్
– తాండూరులో ఆర్డీవో కార్యాలయం ముట్టడి
– తరలివచ్చిన బీసీ సంఘం నాయకులు, విద్యార్థులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఫీజు రియంబర్స్ మెంట్ అమలుపై ప్రభుత్వం కొత్త జీవోలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడోద్దని, పాత విధానంలోనే అమలు చేయాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

సోమవారం బీసీ సంఘం ఆధ్వర్యంలో తాండూరు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడిని చేపట్టారు. కందుకూరి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నాయకులు ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని ముట్టడించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ నేత ఆర్. కృష్ణయ్య చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం అమల్లోకి వచ్చిందని అన్నారు.

2021 నుంచి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజుల కోసం ఒత్తిడి పెంచుతున్నాయని, దీంతో అనేక మంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓలు 7, 8, 9 ప్రకారం విద్యార్థులే ఫీజులు చెల్లించి, తర్వాత డీబీటీ ద్వారా డబ్బులు పొందాలనే విధానం పేద విద్యార్థులకు భారమవుతుందని, కాలేజీలకూ ఇబ్బందులు కలిగిస్తుందని అన్నారు. ఈ జీవోలను వెంటనే రద్దు చేసి, పాత విధానంలోనే నేరుగా కాలేజీలకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

లేదంటే ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, తాండూరు నుంచి వేలాది మంది విద్యార్థులతో అసెంబ్లీ, ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా ప్రతినిధులు అనిత, నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, వీరమణి, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, మండల అధ్యక్షులు నరేందర్, బసంత్, బీసీ విద్యార్థి నాయకురాలు మంజుల, యువ నాయకులు జోసఫ్, రాము ముదిరాజ్, బంగారు నవీన్, మంతన్ గౌడ్ అశోక్, టైలర్ రమేష్, బీటీ సురేష్, పోచయ్య, చిన్న, వివిధ కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఎవరు.. తొలగిపోతారో..!