వైభవంగా ఏరువాక పౌర్ణమి

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా ఏరువాక పౌర్ణమి
– బసవన్నలను ఊరేగించిన రైతులు
– ఊరేగింపులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందడి
తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నదాతకు, రైతు సోదరులకు అత్యంత ప్రియమైన పండుగ ఏరువాక పౌర్ణమిని సోమవారం తాండూరులో వైభవంగా జరుపుకున్నారు.

తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరు, సాయిపూర్ మల్ రెడ్డిపల్లిలకు చెందిన రైతులు సాయంత్రం బసవన్నలను ఊరేగించారు.. ఉదయం నుంచి బసవన్నలను కాలియందియలతో, మెడలో కొత్త గంటలతో, కొమ్ములకు కొత్త అందాలను తీర్చి దిద్దారు.

సాయంత్రం వేళ పండగ సంప్రదాయాన్ని పాటిస్తూ బసవణ్ణలను ఊరంతా ఊరేగించి ఏరువాక పౌర్ణమిని ఉత్స హాంగా జరుపుకున్నారు. సాయిపూర్‌లో సాయంత్రం ఎడ్లబండ్ల ఊరేగింపు కన్నుల పండుగలా జరిగింది. ఎడ్లబండ్ల ఊరేగింపుతో కాలనీ సమీపంలోని సవరమ్మ, రక్తమైసమ్మ ఆలయాల చుట్టు ప్రదక్షనలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

అదేవిధంగా మున్సిపల్ పరిధిలోని పాత తాండూరుతో పాటు మల్ రెడ్డిపల్లిలో, చుట్టు పక్కలా గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని అన్నదాతలు ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు బషీరాబాద్ మండలంలో జరిగిన ఏరువాక పౌర్ణమి వేడుకల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందడి చేశారు. అలంకరించిన ఎడ్లబండిలో ఎక్కి ఊరేగింపులో పాల్గొన్నారు.

బుయ్యని చేదోడు చెరిగిపోదు..!