రేపు భూకైలాస్ లో శనీశ్వర పూజలు
– పూజలో భక్తులకు అవకాశం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాలో వెలసిన భూకైలాస్ ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో రేపు శనివారం శనీశ్వర పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. శనివారం శనిత్రయోదశి సందర్భంగా పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జాతక రీత్యా శనీ అనుకూలం లేని కర్కాటక, వృశ్చిక, మకర, కుంభ, సింహారాశి వారితో పాటు శని మహర్దశ, అంతర్దశ ఉన్న వారు, శనీశ్వర దోషాలు ఉన్న భక్తులు శనివారం ఉదయం 6-00 గంటలకు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించాలన్నారు.
పూజలో పాల్గొనే భక్తులు వక్కలు-5, ఖర్జూర పండ్లు-5, నువ్వుల నూనే-1, నల్లపువ్వు-100 గ్రాములు, నల్ల ద్రాక్ష-1/2, తమల పాకులు -11, నల్లజిల్లేడు పూలు లేదా ఆకులు, టెంకాయలు-2, నలుపు జాకెట్-1 లేదా సల్లదారం తీసుకరావాలన్నారు. అదేవిధంగా ఇనుము చేసిన వస్తువు దానం చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు సెల్: 9010800769కు సంప్రదించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

