శభాష్ ఎర్ర హర్షవర్ధన్..!
– ప్రతిభ గల క్రీడాకారులకు తోడ్పాటు
– ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన ఎర్ర హర్షవర్ధన్ ను తాండూరు ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శభాస్ అంటూ అభినందించారు.

భారత దేశం తరపున అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో ఎర్ర హర్షవర్ధన్ పాల్గొనేందుకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి రూ. 1లక్ష 50వేల ఆర్థిక సాయం అందించారు.. దీంతో హర్షవర్థన్ అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు.

మంగళవారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని హర్షవర్ధన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి హర్షవర్ధన్ ను శభాష్ అంటూ అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ప్రతిభ గల క్రీడాకారులకు తమవంతు తోడ్పాటు అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రేశ్వర దేవాలయ రేనవేషన్ కమిటీ మాజీ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, యువ నాయకులు జోషి వికాస్, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, గాజీపూర్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


