రేషన్ పంపిణీలో మార్పులు..!

జాతీయం టెక్నాలజీ తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రేషన్ పంపిణీలో మార్పులు..!
– ఇక నుంచి ఒక్కో వ్యక్తికి 7కిలోల బియ్యం
– ఆ కుటుంబాలకు వర్తించే షరతులు ఇవే
– జాతీయ ఆహార భద్రత చట్టంలో కొత్త రూల్
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : పేదల పంపిణీ చేసే రేషన్ బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకవస్తోంది. జాతీయ ఆహార భద్రత చట్టం – 2013లో కొత్త నిబంధనను అమలు చేయబోతోంది. ఈ నిర్ణయంతో ఆ కుటుంబాలలో ఒక్కో వ్యక్తికి 7కిలోల రేషన్ బియ్యం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద ప్రాధాన్య వర్గానికి చెందిన లబ్ధిదారులకు ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున ధాన్యం ఇస్తున్నారు. అంత్యోదయ అన్న యోజన కింద లబ్ధి పొందుతున్న కుటుంబాలకు సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ధాన్యం అందిస్తున్నారు.

అయితే ఈ విధానం వల్ల పెద్ద కుటుంబాలు కొన్ని సందర్భాల్లో నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ 35 కిలోలకే పరిమితం కావడంతో ఒక్కో వ్యక్తికి అందే ధాన్యం పరిమాణం తగ్గిపోతోందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యంత పేద వర్గాలకు చెందిన పెద్ద కుటుంబాలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించారు.

ఈ మేరకు జాతీయ ఆహార భద్రత చట్టం- 2013లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంత్యోదయ అన్న యోజన కింద ధాన్యం కేటాయింపును, ప్రతి కుటుంబానికి నెలకు 35 కిలోల నుండి ప్రతి వ్యక్తికి నెలకు 7 కిలోలకు అందించాలని నిర్ణయించింది. ఉదహరణకు ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబం నెలకు 14 కిలోలు లభిస్తాయి (2×7 కిలోలు) 5 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబానికి గరిష్ట పరిమితి ప్రకారం 35 కిలోలు లభిస్తాయి.

అయితే గరిష్ట పరిమితి 35 కిలోలు మాత్రం అలాగే ఉంటుందని స్పష్టం చేసింది. ఇకపై కుటుంబ ఆధారిత కేటాయింపునకు బదులుగా ఒక్కో వ్యక్తికి నెలకు 7 కిలోల చొప్పున ధాన్యాన్ని అందించేలా సవరణ ప్రతిపాదించారు.

సెల్యూట్ ఓ సైనికా..!