తరగతి గదులను శానిటైజ్ చేయాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాఠశాలల్లో ప్రతి తరగతి గదులను శానిటైజ్ చేయాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త అన్నారు. వచ్చే నెల 1నుంచి పాఠశాలలు పునః ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ తాటికోండ స్వప్న పరిమళ్ గారూ మల్‌రెడ్డిపల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. వార్డు కౌన్సిలర్ సాహు శ్రీలత, పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి వంట గది, తరగతి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న మాట్లాడుతూ ప్రతిఒక్కరు కోవిడ్ నిభందనలు పాటిస్తూ పాఠశాల నడపాలని సూచించారు. పాఠశాలలో ప్రతి తరగతి గదులను శానిటైజ్ చేయాలన్నారు. బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, గోడలకు చున్నము, రంగులు వేయించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసీ ఛైర్మెన్ నాగమ్మ, కౌన్సిలర్ ముక్తర్ నాజ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.


