ఈసారి చలి గిలి లేనట్లే..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ రాజకీయం హైదరాబాద్

ఈసారి చలి గిలి లేనట్లే..!
– తేల్చి చెబుతున్న శాస్త్రవేత్తలు
– ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు
– కారణాలు కూడా తెలుసుకోండి
దర్శిని డెస్క్ : చలికాలం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసారి వాతావరణ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రత పెరుగుతుండగా.. ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలపై వాతావరణ శాస్త్రవేత్తలు అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్‌లోనే తెలంగాణలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శీతాకాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, చలిగాలులు వీయడం వంటి పరిస్థితులు సాధారణంగా కనిపిస్తాయి. అయితే ఈసారి అలాంటి చలి తీవ్రత ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం రాబోయే నెలల్లో కొనసాగడంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే వెచ్చని పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఈ ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశాలున్నట్లు WMO పేర్కొంది. చలికాలంలో సాధారణంగా కనిపించే చలితీవ్రతకు భిన్నమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలంగాణలో ఎల్‌నినో బలపడుతున్న నేపథ్యంలో రాబోయే నెలల్లో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి పరిస్థితులు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం శీతాకాలం ముగిసే వరకు కొనసాగితే సాధారణంగా కనిపించే చలి తీవ్రతలో మార్పులు రావచ్చని అంచనా. అయితే శీతాకాలానికి సంబంధించిన తుది ప్రాంతీయ అంచనాలను ఐఎండీ ఇంకా విడుదల చేయాల్సి ఉంది.

ఈసారి చలికాలం.. చలితో వణికిస్తుందా? లేక సాధారణంగానే గడిచిపోతుందా? అన్నది రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు తేల్చనున్నాయి. అయితే తెలంగాణలో చలితరంగాలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలపై పూర్తి స్థాయి ప్రాంతీయ అంచనాలు వెలువడిన తర్వాతే స్పష్టమైన చిత్రం వచ్చే అవకాశం ఉంది.

కొత్త ఆధార్.. ఫ్రీ..!