గోశాలలో కార్తీక దీపోత్సవం

తాండూరు రాజకీయం వికారాబాద్

గోశాలలో కార్తీక దీపోత్సవం
– ఏర్పాట్లు చేసిన గోశాల సేవా సమితి
– భారీ సంఖ్యలో్ తరలిరావాలని పిలుపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సీతారాంపేట్‌లోని గోశాల కార్తీక దీపోత్సవంకు ముస్తాబవుతోంది.రేపు ఆదివారం గోశాలలో గోపూజతో పాటు కార్తీక దీపోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5-01గంటలకు గోపూజ, కార్తీక దీపోత్సవంకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గోభక్తులు, గోసేవకులు, హిందూబందువులందరు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్, గోశాల సేవా సమితి అధ్యక్షులు పట్లోళ్ల బాల్ రెడ్డి, కార్యదర్శి కోట్రిక కిరణ్‌ కుమార్‌లు విజ్ఞఫ్తి చేశారు.

ఇదికూడా చదవండి…

శభాష్ నవీన్ కుమార్..!