అట్టహాసంగా తాండూరు ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రమాణ స్వీకారం
– అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్‌కుమార్ బాధ్యతల స్వీకరణ
– విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేస్తాం
– నూతన అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్ఎస్ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

శనివారం పట్టణంలోని సాయిమేథా స్కూల్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్ధన్‌రెడ్డి, కోశాధికారిగా అబ్దుల్ సలీం బాధ్యతలు స్వీకరించారు. లక్ష్మీనారాయణ గౌరవ అధ్యక్షుడిగా, కల్పన, గూలి శివకుమార్ ఉపాధ్యక్షులుగా, విష్ణువర్ధన్‌రెడ్డి, కవిత సంయుక్త కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. కరుణాకర్‌రెడ్డి పెద్దేముల్, రాజశేఖర్ బషీరాబాద్ మండల ఇన్చార్జిలుగా, జిలాని న్యాయ సలహాదారుగా నియమితులయ్యారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. భాస్కర యోగి మాట్లాడుతూ.. విద్యకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా వ్యవస్థ నాలుగు ప్రధాన స్తంభాలన్నారు. ప్రతి విద్యార్థి సామర్థ్యం, అవసరాలను గుర్తించి బోధనా పద్ధతులను అనుసరించాలని సూచించారు. విద్యలో కమ్యూనికేషన్, భాషకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. అనంతరం డా. భాస్కర యోగిని సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.

అదేవిధంగా నూతన అధ్యక్షుడు గంజిపల్లి ప్రశాంత్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా ద్యావరి జయవర్ధన్‌రెడ్డి, కోశాధికారిగా అబ్దుల్ సలీంలు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పాఠశాలల యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష పదవిని హోదాగా కాకుండా సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానన్నారు. ప్రైవేట్ పాఠశాలల సమస్యలను సమష్టిగా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

‘నేను’ అనే భావనకు బదులు ‘మనం’ అనే స్ఫూర్తితో పనిచేస్తూ తాండూరు విద్యారంగ అభివృద్ధికి కృషి చేద్దాం అని పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. నూతన కార్యవర్గ సభ్యులను పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి 450 మందికి పైగా హాజరయ్యారు.

పోట్లీ మహారాజ్ గుడి చైర్మన్‌గా సుదర్శన్‌గౌడ్‌ను ప్రకటించాలి

