సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి

తాండూరు రాజకీయం వికారాబాద్

సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి
– మెరుగైన విద్యను అందించాలి
– తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి
– మల్ రెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ
– వసతులు, భోజనం, బోధనపై ఆరా
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్‌) అన్నారు.

తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 1 నుంచి 6వ వార్డుల్లో కొనసాగుతున్న స్వచ్ఛత వారోత్సవాల స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా మల్ రెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకే ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, బోధన తీరును పరిశీలిస్తున్నామన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజనం విద్యార్థులకు నాణ్యతతో అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. పాఠశాలలో అన్ని సౌకర్యాలు, భోజనం, చదువులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?’’ అని అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. పాఠశాలల్లో ఏవైనా మౌలిక వసతుల సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, కమిషనర్‌ రాకేష్ రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.

 

గుండెను కాపాడుకుందాం..!