– జాతీయ జెండాను ఎగురవేసిన శంకర్ యాదవ్
తాండూరు, ఆగస్టు 15 (దర్శిని) : తాండూరు పట్టణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఆదివారం పట్టణంలోని మల్లప్ప మడిగ సమీపంలో సర్దార్ వల్లబాయ్ పటేల్ చౌరస్తాలో డోలు, డప్పు వాయిద్యాల మద్య వేడుకలను నిర్వహించారు.
అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తాండూరు సాయిపుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ళ నర్సింలు, సర్దార్ పటేల్ ఆసోషియేషన్ నాయకులు గడ్డం వెంకటేష్, కోటం సిద్దలింగం, హరి చల్లా, ప్రేమ్ కుమార్, రమేష్, జాదవ్, రమేష్ టైలర్, రజినీకాంత్, రాము ముదిరాజ్, మల్ రెడ్డి మల్లేష్ యాదవ్, విఠల్, కిరణ్, శ్రీను, బోయ రాధ కృష్ణ, తాండ్ర నరేష్, జోసెఫ్, బస్వరాజ్, అశోక్, అంబ్రేస్, బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు సయ్యద్ షుకూర్, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
