చిన్నారి వశిష్టకు ఆర్థిక సాయం వెల్లువ
– రూ. 25వేలు అందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్
– వ్యక్తిగతంగా అందించడంపై అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న చిన్నారి వశిష్ఠకు ఆర్థిక సాయం వెల్లువ కొనసాగుతుంది. తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు ఎంతో మంది దాతలు చిన్నారి ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు.

తాజాగా మంగళవారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డా. రవిశంకర్ దంపతులు రూ. 25వేల ఆర్థిక సాయం అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో డా. రవిశంకర్ దంపతులు వ్యక్తిగా చిన్నారి ఆపరేషన్ కోసం సాయం చేశారు. మానవతా దృక్పథంతో డా. రవిశంకర్ దంపతులు చిన్నారి వశిష్ట కోసం సాయం అందించడం పట్ల శ్రీనివాస్ రెడ్డి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, విద్యావేత్త పర్యాద రామకృష్ణ, యువనాయకులు వికాస్ జోషిలు ఉన్నారు.

యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల 9నెలల కుమారుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతుండగా కాలేయ మార్పిడి కోసం దాదాపు రూ.23లక్షలు ఖర్చు అవుతుండడంతో దాతలు మందుకు వచ్చి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదికూడా చదవండి…

