స్థాయిని పెంచే సేవలు అందించండి
– తాండూరు సబ్ కలెక్టర్ శుభాకాంక్షలు
– పుష్పగుచ్చం అందించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ స్థాయిని పెంచే సేవలందించాలని నూతన సబ్ Q కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోరారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయ స్థాయిని సబ్ కలెక్టర్ స్థాయికి పెంచడంతో కొత్త సబ్ కలెక్టర్ గా ఉమా శంకర్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. సోమవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చ అందించి శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు సబ్ కలెక్టర్ స్థాయిని పెంచే విధంగా ప్రజలకు సేవలను అందించాలని కోరారు. తాండూరు పట్టణ అభివృద్ధికి సహాకారం అందించాలని కోరారు.
ఇదికూడా చదవండి…

