శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

శ్రీ ఆద్య మృతిపై విచారణ జరపాలి
– ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉంచేలా చూడాలి
– వైద్య సేవలు, మందుల నిల్వ నిర్లక్ష్యం తగదు
– బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు చెందిన నరేష్, సంగీత దంపతుల ఆరేళ్ల కుమార్తె శ్రీ ఆద్య మృతి ఘటనపై విచారణ జరపాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

మంగళవారం బాధిత కుటుంబాన్ని ఆయన సంఘం నేతలతో కలిసి పరామర్శించారు. మందులు లేవనే ఆరోపణలతో శ్రీ ఆధ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ సంఘం నాయకులు రుక్మాపూర్‌కు వెళ్లి శ్రీ ఆద్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్, సర్పంచ్ బాలు, మండల బీసీ సంఘం అధ్యక్షుడు శ్రవణ్ మాట్లాడుతూ.. శ్రీ ఆద్య మృతి ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కోరారు.

కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలపై అధికారులు వాస్తవాలను పరిశీలించి బాధ్యతలు, లోపాలు ఏమైనా ఉంటే గుర్తించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, పెద్దమూలు మండల మహిళా అధ్యక్షురాలు శివలీల, యాలాల మండల అధ్యక్షుడు లక్ష్మణచారి, బీసీ నాయకులు మల్లేశ్, అశోక్, టేలర్ రమేశ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

తాండూరు అభివృద్ధికి నిధుల వరద