సూదీ ఒద్దంటూ.. చింత‌చెట్టెక్కాడు..!

జాతీయం తెలంగాణ

సూదీ ఒద్దంటూ.. చింత‌చెట్టెక్కాడు..!
– ఇంజ‌క్ష‌న్‌కు భ‌య‌ప‌డిన యువ‌కుడు
– సంగారెడ్డి వ్యాక్సీనేష‌న్ డ్రైవ్‌లో ఘట‌న
హైద‌రాబాద్‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: త‌న‌కు సూదీ మందు ఇవ్వొద్దంటూ ఓ యువ‌కుడు ఇంజ‌క్ష‌న్ భ‌యంతో చింత చెట్టు ఎక్కి కూర్చున్నాడు. వ్యాక్సీనేష‌న్ డ్రైవ్ కోసం వ‌చ్చిన వైద్య సిబ్బందికి యువ‌కుడి వైఖ‌రితో ఇబ్బంది ప‌డ్డారు. స్థానికులు యువ‌కుడి హంగామాను సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకుంటూ.. మానవాళిని భయపెడుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం కొత్త‌గా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఒమిక్రాస్ వైర‌స్ ప‌ట్ల ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది. ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒమిక్రాన్ కు అడ్డుకట్ట వేయడానికి మనదేశం కూడా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ప్రజల దగ్గరకె వెళ్లి మరీ వ్యాక్సిన్ ఇస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికి తీరుగుతూ అర్హులైన వారంద‌రికి పంపిణీ చేస్తున్నారు. ఈక్ర‌మంలో సంగారెడ్డి జిల్లా న్యాల్‌ కల్‌ మండలంలో అధికారులు వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. రేజింతల్‌ గ్రామంలో అర్హులైన వారికి వ్యాక్సిన్‌ వేస్తుండగా సిబ్బందిని చూసిన గౌస్‌ ఉద్దీన్‌ అనే యువకుడు పారిపోయాడు. తనకు వ్యాక్సిన్‌ వద్దంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి సమీపంలోని ఓ పెద్ద చింతచెట్టేక్కి కూర్చున్నాడు. అతన్ని కిందకు దింపటం అక్కడున్న వారందరికీ పెద్ద తలనొప్పిగా మారింది. యువ‌కుడికి టీకా వేయాల‌ని అధికారులు.. సిబ్బంది నానా ర‌కాలుగా న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయిప్ప‌న‌ప్ప‌టికి నాకు సూది మందు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని ఘ‌ట్టిగ వాదించాడు. ఎలాగోలా అతనికి టీకా వేసే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.