పీపుల్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ జోష్‌..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

పీపుల్స్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌ జోష్‌..!
– ఆటపాటలతో హోరెత్తిన వేడుకలు
– కాలేజీలో టాపర్లకు సత్కారం, మిస్టర్‌, మిస్‌ ఫ్రెషర్‌ ఎంపిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాటలు.. ఆటలు.. సాంస్కృతిక ప్రదర్శనలు.. విద్యార్థుల కేరింతల మధ్య పీపుల్స్‌ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తులసి గార్డెన్‌ వేదికగా జరిగిన ఈ సంబరాల్లో జూనియర్లకు సీనియర్లు ఘనంగా స్వాగతం పలికారు.

విద్యార్థుల ఉత్సాహభరిత ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ పి. ఉత్తమ్‌చాంద్‌ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ, పట్టుదల ఎంతో ముఖ్యమని అన్నారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు.

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు పునాది పడుతుందని పేర్కొన్నారు. వేడుకల్లో మరో ప్రత్యేకతగా గత విద్యా సంవత్సరంలో కళాశాల టాపర్లను ఘనంగా సన్మానించారు. ఈ ఏడాది కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన విద్యార్థుల్లో మిస్టర్‌ ఫ్రెషర్‌, మిస్‌ ఫ్రెషర్‌లను ఎంపిక చేశారు.

విద్యార్థుల ఆటపాటలు, వినోద కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ రవీందర్‌ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఊపిరితిత్తులకు.. ఊరట..!