కార్మికుల ఆరోగ్యాలపై శ్రద్ధ

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికుల ఆరోగ్యాలపై శ్రద్ధ
– బీమా సదుపాయంతో భరోసా
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– కార్యాలయంలో ఘనంగా స్వచ్ఛత హీ సేవా
– 161 కార్మికులకు వైద్య శిబిరం, బీమా బాండ్ల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని మున్సిపల్ కార్మికుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందని చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు. మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మున్సిపల్ కమీషనర్ ఆధ్వర్యంలో కార్యాలయంలో పనిచేస్తున్న 161 పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లతో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మికులతో కలిసి చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల భద్రత కోసం మున్సిపల్ నుంచి చేయించిన బీమా బాండ్లను అందజేశారు. అనంతరం పరీక్షలు చేయించుకున్న వారికి మందులు, పండ్లు అందజేశారు. ఈ. సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమన్నారు. మున్సిపల్ కార్మాకుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. వారికి బీమా సదుపాయం కల్పించడం భరోసా అందించడం జరుగుతుందన్నారు.

వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, కమీషనర్ షఫీవుల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, డీఈ ఖాజా, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, సంగీత ఠాకూర్, ప్రవీణ్ గౌడ్, శానిటరీ ఇను స్పెక్టర్లు వెంకటయ్య, కృష్ణయ్య, ఆర్ఐ ఆంజనేయులు, ఈఈ ప్రవీణ్ గౌడ్, సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు