టీయూడబ్లూజే జిల్లా ట్రెజరర్ పీవీఆర్ కు ఘన సన్మానం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

టీయూడబ్లూజే జిల్లా ట్రెజరర్ పీవీఆర్ కు ఘన సన్మానం..!
– జర్నలిస్టుల సంక్షేమానికి చేసిన సేవలకు ప్రశంసలు
– వెంకట్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు, విద్యావేత్తలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ-IJU) వికారాబాద్ జిల్లా కోశాధికారిగా ఎన్నికైన తాండూరుకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సీనియర్ జర్నలిస్ట్ పెరుమాళ్ల వెంకట్‌రెడ్డిని గురువారం ఘనంగా సన్మానించారు.

జర్నలిస్టు మిత్రులు జగన్నాథ్‌రెడ్డి (వార్త), రామకృష్ణ (సాక్షి), మహేష్ (ఆంధ్రప్రభ)తో పాటు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, రాజకీయ పార్టీల నాయకులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యారంగంలో విశేష సేవలు అందించడంతో పాటు పాత్రికేయ రంగంలోనూ వెంకట్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. గతంలో తాండూరు డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో జర్నలిస్టులకు సొంత ఖర్చులతో ప్రమాద బీమా కల్పించారని గుర్తుచేశారు.

అలాగే యూనియన్ పెద్దల సహకారంతో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించడంలో కృషి చేశారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి జర్నలిస్టుల సంక్షేమానికి మరింత సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

సింధు కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే..!