ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి
– నివాళులు అర్పించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండప సమీపంలో ఉన్న పొట్టి శ్రీరాములు పార్కులు జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అదేవిధంగా ఆర్యవైశ్య, వాసవి, వైశ్య ఫెడరేషన్ నాయకులు కూడ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌తో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషిచేసిన మహనీయుడని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కోస్గి తిప్పయ్య, నగరేశ్వరాలయ చైర్మన్ కుంచెం మురళీధర్, కట్కం వీరేందర్, అలంపల్లి శ్రీనివాస్, వైశ్య ఫెడరేషన్ జిల్లా ప్రెసిడెంట్ రొంపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

