చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్‌కు స‌న్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు ప‌ట్ట‌ణాభివృద్ధికి కృషి
– మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, కౌన్సిల‌ర్ సాహు శ్రీ‌ల‌త‌ల‌కు ప‌ట్ట‌ణంలోని శాంత‌ప్ప కాల‌నీ వాసులు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆదివారం వార్డు నెంబ‌ర్ 24లో కాల‌నీ వాసులు మున్సిప‌ల్ చైర్ ప‌ర్సన్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్‌, కౌన్సిల‌ర్ సాహు శ్రీ‌ల‌తల‌ను కాల‌నీ వాసులు ఘ‌నంగా స‌న్మానించారు. మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ స‌హాకారంతో శాంతప్ప కాలనీలో రూ. 5 లక్షలతో చేప‌ట్టిన సీసీ రోడ్లు పనులు పూర్తి అయిన సంద‌ర్భంగా వార్డు ప్ర‌జ‌లు వారికి ఈ స‌న్మానం నిర్వ‌హించి ధ‌న్య‌వాదాలు తెలిపారు. కాల‌నీలో రోడ్డు సౌక‌ర్యం స‌క్ర‌మంగా లేక ఇబ్బందులు ప‌డేవార‌మ‌ని గుర్తుచేశారు. స‌మ‌స్య‌ను చైర్ ప‌ర్స‌న్, కౌన్సిల‌ర్ల దృష్టికి తీసుకెళ్ల‌డంతో స్పందించి ప‌రిష్క‌రించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. అనంత‌రం చైర్ ప‌ర్స‌న్ స్వ‌ప్న ప‌రిమ‌ళ్ మాట్లాడుతూ తాండూరు పట్టణ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. కౌన్సిల‌ర్ సాహు శ్రీ‌ల‌త మాట్లాడుతూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ పెద్ద‌లు, నాయ‌కులు పాల్గొన్నారు.