స్వచ్ఛ తాండూరుకు బాధ్యతగా పనిచేయాలి

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

స్వచ్ఛ తాండూరుకు బాధ్యతగా పనిచేయాలి
– తాండూరు మున్సిపల్ అధికారులు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరును స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు కార్మికులు బాధ్యతగా పనిచేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా గురువారం తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పాత మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మాస్కులు, గౌసులు, యాప్రాన్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ బుచ్చిబాబు, శానిటరీ ఇనుస్పెక్టర్ శ్యాంసుందర్, ఎన్విరాల్‌మెంట్ ఇంజనీర్ ప్రవీణ్ గౌడ్ లు మాట్లాడుతూ ప‌ట్ట‌ణాన్ని ప‌రిశుభ్రంగా ఉంచ‌డంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర చాల కీలక‌మ‌న్నారు. పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరణపై అవగాహన కల్పించారు. దీంతో పాటు హోం కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. ప్రతి రోజూ బాధ్యతగా విధులు నిర్వహించి తాండూరును స్వచ్ఛ పట్టణంగా మార్చేందుకు పనిచే యాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అంత‌ముందుకు కార్మికుల‌కు అందించిన కిట్ల‌ను ఏ విధంగా ఉప‌యోగించాలో వివ‌రించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.