దత్తాత్రేయుని సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

దత్తాత్రేయుని సేవలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– జయంతిని పురస్కరించుకుని దర్శనం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : ఉమ్మడి రంగారెడ్డి ఎమ్మెల్సీ, మాజీ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి దత్తాత్రేయుని సేవలో తరించారు. శనివారం దత్తాత్రేయుని జయంతి పురస్కరించుకుని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కర్ణాటకలోని ఘానుగాపూరు వెళ్లారు. అక్కడి ఆలయంలో వెలసిన ద‌త్తాత్రేయ‌ స్వామి వారిని మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు మంత్రోచ్ఛరణలో దత్తాత్రేయ స్వామికి మహేందర్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు, పేదలకు పండ్లు వితరణ చేశారు. మరోవైపు ఆలయ అర్చకులు రెండోసారి ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని స్వామి వారి ఫోటో బ‌హుక‌రించి.. శాలువాతో సన్మానించారు.
ఎమ్మెల్సీ వెంట టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పెద్దోళ్ల నర్సింలు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల సాయిపూర్ బాల్ రెడ్డి, పెద్దేముల్ పిఎసిఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి. యువ నాయకులు శ్రీకాంత్, అశోక్ తదితరులు ఉన్నారు.