సీఎంఆర్ఎఫ్‌తో ప్ర‌జా ఆరోగ్యాల‌కు భ‌రోసా

తాండూరు రాజకీయం వికారాబాద్

సీఎంఆర్ఎఫ్‌తో ప్ర‌జా ఆరోగ్యాల‌కు భ‌రోసా
– రూ. 1.50ల‌క్ష‌ల ఎల్ఓసీని అంద‌జేసీన కేపీఆర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సీఎం స‌హాయనిధి(సీఎంఆర్ఎఫ్) ప‌థకం పేద ప్ర‌జ‌ల ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పిస్తుంద‌ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క‌ర‌ణం పురుషోత్తంరావు పేర్కొన్నారు. యాలాల మండల కేంద్రానికి చెందిన గోపన్‌ప‌ల్లి పాండురంగంకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 1ల‌క్ష 50వేల‌ను మంజూరు చేసింది. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి రంగారెడ్డి ఎమ్మెల్సీ మహేంద‌ర్ రెడ్డి ఆదేశాల మేర‌కు ల‌బ్దిదారుని తండ్రి గోపన్ పల్లి కిష్టప్పకు సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీని రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు యాలాల‌ జడ్పీటీసీ సిద్రాల సంధ్యారాణితో క‌లిసి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని వారు వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించకునేందుకు సీఎంఆర్‌ఎఫ్ భ‌రోసా అందిస్తుంద‌ని అన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా సీఎంఆర్‌ఎఫ్‌ కింద నిధులు మంజూరు చేయించి, ప్రజారోగ్యాలకు కృషి చేస్తున్న ఎమ్మెల్సీ మహేంద‌ర్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నాగారం పాండు గౌడ్, భాస్కర చారి, జీవీ రెడ్డి, రాపోలు రాములు, బాబూమియా, నమిలిగే గోపాల్, ఉప్పరి బాలు, మంగళి మొగులప్ప త‌దిత‌రులు పాల్గొన్నారు.