పరిమళ్ గుప్త కుటుంబాన్నిపరామర్శించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు తాటికొండ పరిమళ్ గుప్త, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ గుప్త కుటుంబాన్ని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి పరిమళ్ గుప్త తల్లి తాటికొండ కల్పన కన్నుమూశారు. గత కొన్ని రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు.
శుక్రవారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు పట్టణంలోని పరిమళ్ గుప్త నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాటికొండ కల్పన పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరిమళ్ గుప్త, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెంట సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నర్సింలు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
