సాయం.. సేవే ఏసు మార్గం

తాండూరు రాజకీయం వికారాబాద్

సాయం.. సేవే ఏసు మార్గం
– బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమిక్రిస్మస్ వేడుకలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : పరులకు చేసే సాయం.. సేవచేయడమే ఏసుక్రీస్తు మార్గం అని పాస్టర్ డీఎస్ కే.జనార్దన్, తాండూరు బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు.. తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితా సంపత్‌లు అన్నారు. గురువారం రాత్రి తాండూరులో బీవీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్.కె. జనార్దన్, సునితా సంపత్లు మాట్లాడుతూ సమాజంలో పరులపై జాలి, దయ, కరుణతో పాటు సాయం చేయడం.. సామాజిక చేయడమే ఏసు మార్గమన్నారు. ఏసు స్పూర్తితో అందరు పరులకు సహాయ పడడం.. సేవ చేయడాలన్ని అలవర్చుకోవాలన్నారు. ఏసు స్పూర్తితోనే తాండూరులో బీవీజీ ఫౌండేష‌న్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు సునితాసంప‌త్ పేర్కొన్నారు. కరోనా కష్టంలో బీవీజీ ఫౌండేషన్ ఎంతో మంది పేదలకు చేయూతనందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ బాస్కర్, అభిరామ్, కిష్టఫర్, బీవీజీ ఫౌండేషన్ ప్రతినిధులు లింగదలి రవికుమార్, శ్రీనివాస్, మహేష్ ఠాకూర్, అంకిత్ అనురాగ్ త‌దితరులు పాల్గొన్నారు.