మందుబాబులకు గుడ్ న్యూస్
– 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలకు అనుమతి
– మరో గంట వరకు బార్లకు, ఈవెంట్స్ లకు ఒకే
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : నూతన సంవత్సర వేడుల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా విజృంభిస్తున్న వేళ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తారని అంతా భావించారు. ఇందుకు భిన్నంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తెలంగాణలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు పూర్తి అనుమతి ఇచ్చింది. మద్యం షాపులు, బార్లు, స్పెషల్ ఈవెంట్లకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలకు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. అదేవిధంగా బార్స్, ఈవెంట్స్, టూరింజ హోటల్స్ కు మరోగంట పొడగిస్తూ రాత్రి ఒంటి గంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మరోవైపు మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతూనే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. కోవిడ్ నిబంధనలతో పాటు ట్రాఫిక్ నిబంధనపై ప్రభుత్వం పోలీసులు సైతం ప్రజలను అప్రచేయాలని చెప్పింది. దీంతో మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిసెంబర్ 31 రోజంతా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

