మ‌హేంద్ర‌న్న అభిమానుల‌కు శుభ‌వార్త

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

మ‌హేంద్ర‌న్న అభిమానుల‌కు శుభ‌వార్త
– కోవిడ్ నుంచి కోలుకున్న ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి
– త‌న‌కోసం ప్రార్థ‌న‌లు చేసినందుకు అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అభిమానుల‌కు శుభవార్త‌. క‌రోనా బారిన ప‌డిన ఆయ‌న ఆరోగ్యంగా కోలుకున్నారు. గ‌త కొన్ని రోజుల క్రితం స్వ‌ల్ప కొవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. అందులో పాజిటివ్ అని తేల‌డంతో వారం రోజులుగా హోం ఐసోలేష‌న్‌లో ఉండిపోయారు. ప్ర‌స్తుతం కోలుకోవ‌డంతో మ‌రోసారి ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల‌లో ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డిని నెగిటివ్ అని తేలింది. మ‌హేంద‌ర్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న అభిమానులు మ‌హేంద‌ర్ రెడ్డి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని జిల్లా వ్యాప్తంగా పూజ‌లు నిర్వ‌హించారు. తాండూరు ప్రాంతంలో అయితే దేవాల‌యాలు, మ‌సీదులు, ద‌ర్గాలు, చెర్చిల‌లో పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేశారు. మ‌హేంద‌ర్ రెడ్డి ఆరోగ్యంగా కోలుకున్నార‌ని తెలియ‌డంతో నాయ‌క‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు, అభిమానులు సంతోషం వ్య‌క్తం చేశారు. ఆరోగ్యంగా కోలుకోవ‌డంతో రేప‌టి నుంచి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా స‌మ‌యంలో తాను కోలుకోవాల‌ని పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేసిన నాయ‌కుల‌కు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు, అభిమానుల‌కు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి పేరు పేరున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేవుని ద‌య‌, అభిమానులు, నాయ‌కుల ప్రార్థ‌న‌ల‌తో కోలుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు, నాయ‌కుల‌కు ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి సంక్రాంతి, క‌నుమ పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు.